పెరుగు అన్నం ఎందుకు ప్రిఫర్ చేయాలి?

అవును ! పెరుగు అన్నం మస్తుగా తింటే ఏమొస్తుంది? ..కంటి నిండా నిద్ర వస్తుంది..మహా అయితే ఒళ్లు వస్తుంది…ఇదీ మనం చిన్నప్పుటి నుంచీ వింటున్న మాట.. అయితే పెరుగు అన్నం వల్ల కేవలం నిద్రేనా ..ఇంకేమీ ఉపయోగం లేదా… అంటే చాలా ఉన్నాయి అని  చెప్పాలి. 
పెరుగులో ట్రైప్టోఫాన్‌ అనే అమైనో ఆమ్లము  ఉంటుందని చాలా మందికి తెలియదు. ఈ ఆమ్లము వల్ల మానసిక అలసట క్షణాల్లో మాయం అవుతుంది. మనసు ప్రశాంతత పొంది మంచి నిద్ర పడుతుంది. ఈ ఆమ్లానికి సంస్కృతంలో తృప్తి అనే పేరు ఉంది. తృప్తి అంటే అర్దం తెలుసుకదా సాటిస్ ఫేక్షన్.  తమిళ బ్రాహ్మలు ఎక్కువగా పెరుగు అన్నాన్ని ప్రిఫర్ చేస్తారు. అందుకే తమిళంవాళ్లు ఎక్కువ తృప్తితో, సంతోషంగా విజేతలుగా నిలుస్తారంటారు.  
నిజానికి పెరుగుని పెరుగులా తీసుకుంటే చాలా ఆరోగ్యం కానీ వెస్టనర్స్ ..పెరుగులో పంచదార కలుపుకుని యోగుర్త్ గా మార్చుకుని తింటూంటారు. ఎప్పుడైతే పంచదార కలిసిందో పెరుగు విలువ మొత్తం పోతుంది. గ్లూకోజ్ లెవిల్స్ పెరిగిపోయి రెస్ట్ లెస్ గా మారిపోతారు. అదే చక్కగా మన పెద్దవాళ్లు చెప్పినట్లుగా..పెరుగు అన్నం తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. పెరుగులో ఉన్న కార్బో హైడ్రేట్స్‌, ప్రొటీన్లు అలసటని దూరం చేస్తాయి. పెరుగులో ఉన్న ప్రో బయోటిక్స్‌ మన జీర్ణ వ్యవస్థకి కూడా చాలా మంచిది. రోజులో ఎప్పుడైనా సరే ఒకకప్పు పెరుగు తీసుకోండి.
ఇక సాధారణంగా పగటిపూట పెరుగు తీసుకోవడం మంచిది. రాత్రి పూట తినకుండా ఉంటే బెటర్. ఆయుర్వేదం కూడా పెరుగును రాత్రి తీసుకోవద్దనే చెబుతోంది. ముఖ్యంగా జలుబు, దగ్గు వంటి వాటికి తరచుగా గురయ్యేవారు, అలర్జీ సమస్యలు ఉన్న వారు రాత్రుళ్లు పెరుగు తీసుకోరాదు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఏర్పడేందుకు ఇది కారణమవుతుంది. దాంతో దగ్గు, జలుబు సమస్యలు పెరిగిపోతాయి. ఇది మాత్రం గుర్తించుకోండి.