ఆరోగ్యానికి చిరునామా.. ‘అహోబిలం మిల్లెట్ కేవ్’

ఫాస్ట్ ఫుడ్ కల్చర్‌తోనే రాగోలు ఎక్కువైపోతున్నాయని… తృణ ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగంతో సంపూర్ణ ఆరోగ్యం సమకూరుతుందని ఈ మధ్యకాలంలో మనమంతా వింటున్న మాట. లైఫ్ స్టైల్ అనారోగ్యాలైన షుగర్, బిపి, కొలొస్టాల్ వంటివారి బారి నుంచి గట్టెక్కాలంటే చిరుధాన్యాలు తీసుకోవాలని న్యూట్రీషన్లు రికమెండ్ చేస్తున్నారు. చిరు ధాన్యాలు మన శరీరానికి కావాలసిన పోషకాలను అందిస్తాయి. బియ్యం, గోధుమలు, బార్లీ, సజ్జలు, మొక్కజొన్నల్ని వండి తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా ఫాట్ తగ్గుతుంది. ఊబకాయాన్ని దూరం చేసుకోవచ్చునని చెబుతున్నారు. అయితే మనకు వీటిపై అవగాహన తక్కువ. ఎలా వండుకు తినాలో తెలియదు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా హేమమాలిని గారుకి వచ్చిన ఈ ఆలోచన హైదరాబాద్ లో అహోబిలం రెస్టారెంట్ వెలిసింది. ఈ రోజున సిటీలో ఎందరికో ఈ రెస్టారెంట్ చక్కటి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తోంది.
ఏల్చూరి ఆయుర్వేదం క్లాసెస్ కు హాజరయ్యిన తర్వాత అక్కడ చిరు ధాన్యాల ప్రయోజనాలు గురించి విని, వంటలపై ప్రయోగాలు చేసి తర్వాత ఈ రెస్టారెంట్ పెట్టాలనే ఆలచన వచ్చిందని చెప్తారామె. అలాగే ఈ చిరు ధాన్యాలను తామే కర్నూలులోని అహోబిలంలో తన సొంత పొలంలో సేంద్రీయ ఎరువులతో పండిస్తున్నామని చెప్తారు. మొదట స్టోర్ పెట్టామని అయితే తమ దగ్గర నుంచి రాగులు, చోళ్లు,సజ్జలు,గంటెలు వంటివి పట్టుకు వెళ్తున్నా..వాటిని ఎలా వండుకోవాలో తెలియటం లేదని తెలిసిందని, టైమ్ ఉండటం లేదని అనేవారు. దాంతో తాను చిరు ధాన్యాలతో వంటలు తయారు చేసి హోటల్ పెట్టారు. హోటలైతే పెట్టారు కానీ మొదట్లో అన్ని నష్టాలు. పెట్టిన పెట్టుబడి రాలేదు. వండిన ఆహారం మిగిలిపోయేది..అప్పులు పాలయ్యే పరిస్దితి వచ్చిందని..అయితే కొద్ది కాలానికి కొన్ని వ్యాపార మెళకవలతో అహోబిలం మిలట్ కేవ్ రెస్టారెంట్ కాస్త జనాల్లోకి వెళ్లటం మొదలైంది. తిన్న వాళ్లు మౌత్ పబ్లిసిటీతో పుంజుకోవటం జరిగింది.
ఇక్కడ మరో స్పెషాలిటి ఏమిటంటే…వండేది, వడ్డించేది అంతా మట్టిపాత్రల్లోనే. చివరకి నీళ్లూ, మజ్జిగ కూడా మట్టి పాత్రల్లోనే ఇస్తారు. ఉదయం టిఫెన్ గా ..తృణ ధాన్యాలతో చేసిన ఇడ్లీలు, దోశలు, ఉప్మా, పకోడీలు ఉంటాయి. మధ్యాహ్నం లంచ్ కు జొన్న రొట్టెలూ, దంపుడు బియ్యంతో చేసిన అన్న, సాంబార్ రైస్ ఉంటుంది. అలాగే రాగి సంకటి, బొబ్బర్ల పులుసు వంటి స్పెషల్ వంటలు ఉంటాయి. ఇంకా కొర్రల బిర్యాని, కొర్ర బిసిబెళా బాత్, కొర్ర పులిహోరా, మినప వడలు, జొన్న రొట్టి, జొన్న సమోసా, మల్టీ మిల్లెట్ రోటీ, రాగులు కొర్రలతో చేసిన మిఠాయిలూ ఇక్కడ ప్రత్యేక.. శుక్ర,శని, ఆదివారాల్లో బఫె, లంచ్,డిన్నర్ ఉంటుంది.
నారాయణ స్కూల్, టెక్ మహేంద్రా, గూగుల్ సంస్ధలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఇన్ఫోసిస్, సీఎన్టీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాజమౌళి వంటి ప్రముఖులు ఈ రెస్టారెంట్ కు వస్తూంటారు. తమ దగ్గర కష్టమర్స్ కు షుగర్, బ్లడ్ ప్రెజర్, బరువు తగ్గటం వంటివి జరిగింది అని ఆమె సంతోషంగా చెప్తారు. 15 నుంచి 20 మంది దాకా ఉద్యోగస్దులతో నడుస్తున్న ఈ అహోబిలం ఖచ్చితంగా వెళ్లి రావాల్సిన మంచి ఫుడ్ కార్నర్ అనటంలో సందేహం లేదు. రాగి, మొక్కజొన్న, సజ్జలు వంటి ధాన్యాలను వండి తినడం ద్వారా మధుమేహం, ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. చిరుధాన్యాల్లో ఫైబర్, సున్నం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణశక్తిని పెంపొందింపజేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను క్రమంగా ఉంచుతాయి. అనవసర కొవ్వును తగ్గిస్తాయి. బిడ్డతల్లులకు పాలు పడుతాయి. ఎడ్రస్ Ahobilam Foods – Organic Cave jntu-hitech city road, cyberbad, Madhapur స్విగ్గీ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే రెస్టారెంట్ లో దొరికే వివిధ పదార్దాలు ఇంటికే తెచ్చి ఇస్తారు.